అప్పుల బాధతో యువకుడు మృతి

వరంగల్: కాటారం మండలం చిదనపల్లి గ్రామానికి చెందిన మార్క రాజేందర్ ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తూ రైతులకు ఉధారిగా ఎరువులు ఇచ్చాడు. దాదాపు రూ.20 లక్షల అప్పు పడడంతో మనస్తాపానికి గురై గత నెల 28న ఇంటి నుండి వెళ్లిపోయాడు. మహాదేవపూర్‌లోని అయ్యప్పస్వామి గుడి సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.