ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 18 గ్రామాల నుంచి విశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మొత్తం 149 వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.