పెబ్బేరులో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

MBNR: పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడం గ్రామంలో కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ.. ఎంతోమంది శ్రామికుల చేతులు కలవకుండా ఏ పారిశ్రామికవేత్త విజయం సాధించలేడు. ప్రతి పారిశ్రామికవేత్త విజయం వెనుక వేల మంది ఉద్యోగులు/కార్మికుల కృషి ఉంటుందన్నారు.