ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తిరుపతి
PDPL: పెద్దపల్లి నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ముత్యాల తిరుపతి నియమితులయ్యారు. ఈ మేరకు ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షురాలు తలారి స్వప్న సాగర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామ ఉప సర్పంచ్ తిరుపతికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.