జనన, మరణ పత్రాల కోసం ప్రజల ఇబ్బందులు
NLG: గత 20 రోజులుగా మీ సేవ కేంద్రాల్లో జనన, మరణ పత్రాలకు సంబంధించిన సైట్ ఓపెన్ కాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని నల్గొండ పట్టణ మాజీ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి తెలిపారు. జనన, మరణ పత్రాల కోసం వారి కుటుంబ సభ్యులు మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.