గంజాయి విక్రయాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

గంజాయి విక్రయాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

SRCL: గంజాయి విక్రయాలు, రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువత కదలికలను గమనిస్తూ ముందుకు సాగుతున్నారు. వీర్నపల్లి మండలంలోని పల్లెల్లో ఎండు గంజాయి అమ్మకాలు అధికమవడంతో ఎస్సై లక్ష్మణ్ ఆధ్వర్యంలోని పోలీసులు వేటను ప్రారంభించారు. ఆదివారం కంచర్ల గ్రామంలోని అనుమానితుల ఇళ్లు, కిరాణా షాపుల్లో సోదాలు నిర్వహించి, పరిసరాలను తనిఖీ చేశారు.