శింగనమలలో బడ్జెట్‌పై అవగాహన సదస్సు

శింగనమలలో బడ్జెట్‌పై అవగాహన సదస్సు

ATP: శింగనమల మండల ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బడ్జెట్ అవగాహన కార్యక్రమం ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆధ్వర్యంలో శనివారం జరిగింది. నిధుల వ్యయంలో పారదర్శకత పెంచి, ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.